Posts

వెనుజులా సంక్షోభం : చమురు ఉన్నా చీకట్లోనేనా దేశ భవిష్యత్తు? i Venezuela Crisis: Despite Having Oil, Is the Country's Future Still in Darkness?

Image
      – భారత సుదర్శన్ , సామాజిక,  ఆర్థిక,  రాజకీయ   విశ్లేషకులు -    లాటిన్ అమెరికాలో ఉన్న ‘వెనుజులా’ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిక్షేపాలు ఉన్న దేశం . ఇది దక్షిణ అమెరికాలోని ఉత్తర సముద్ర తీరంలో ఉంది. జీవ వైవిధ్యంలో ఈ దేశం ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉంది. ఈ దేశ అతివలు ప్రపంచ అందాల పోటీలలో గెలుస్తుంటారు. దీని రాజధాని కార్కాస్. అధికారిక కరెన్సీ వెనుజులా బొలివర్. ఒకప్పుడు అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందినది వెనుజులా . కానీ నేడు అదే దేశం ఆకలి , నిరుద్యోగం , వలసలు , రాజకీయ గందరగోళానికి ప్రతీకగా మారింది . చమురు ఉన్న దేశాలు శక్తివంతంగా మారతాయనే సాధారణ అభిప్రాయానికి విరుద్ధంగా , వెనుజులా కథ ఒక హెచ్చరికలా నిలుస్తోంది . ఇక్కడి సంక్షోభం కేవలం ఒక దేశ అంతర్గత సమస్య కాదు . ఇది అంతర్జాతీయ రాజకీయాలపై , అమెరికా – లాటిన్ అమెరికా సంబంధాలపై , చైనా – రష్యా వ్యూహాలపై , అంతేకాదు ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతున్న ఒక గ్లోబల్ క్రైసిస్ . అయితే ప్రశ్న ఒక్కటే -- అపారమైన సహజ సంపద ఉన్నా , వెనుజులా ఎందుకు...