‘మిషన్ లైఫ్’ కోసం ‘ఎకోక్లబ్’లు I Eco Clubs for Mission LiFE
ప్రపంచ పర్యావరణచరిత్రలో భారతీయులు అనాదికాలం నుండి ప్రకృతి ప్రేమికులు. ప్రకృతితో సామరస్యపూరిత జీవనం గడపటం మన దేశంలో ప్రాచీనకాలం నుండి కొనసాగుతున్నది. ఆనాడు ప్రజలు ఋషులు రాజులు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి స్వంత నైతిక భాద్యతగా భావించేవారు. హరప్పాకాలం నాటి లోహరి పండుగ మొదలు నేటి బతుకమ్మ , తీజ్ పండుగల వరకు అన్నీ కూడా ప్రకృతిహిత ప్రాతిపదిక గల పండుగలే. అఖండ భారతాన్నేలిన అశోకుడు చెట్లను పెంచుటకు శాసనాలు చేసి రోడ్లకిరువైపుల చెట్లను నాటించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడి వనప్రేమికుడుగా చరిత్రలో నిలిచాడు. నేటి ఆధునికకాలంలో మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు ముమ్మరంగా అమలు చేయబడుతున్నాయి. పచ్చదనం మరియు పరిశుభ్రతలను పెంపొందించే లక్ష్యంతో ప్రజల జీవన నాణ్యత మెరుగుదల కోసం ప్రపంచ ప్రజల జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల వారి పర్యావరణ ప్రవర్తనలో సానుకూల మార్పులను ప్రోత్సహించడానికి ప్రజల భాగస్వామ్యంతో ఇటీవల పర్యావరణం కోసం జీవనశైలి ( లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్-లైఫ్) అనే పరివర్తనోద్యమ కార్య...