‘మిషన్ లైఫ్’ కోసం ‘ఎకోక్లబ్’లు I Eco Clubs for Mission LiFE

 


    ప్రపంచ పర్యావరణచరిత్రలో భారతీయులు అనాదికాలం నుండి ప్రకృతి ప్రేమికులు. ప్రకృతితో సామరస్యపూరిత జీవనం గడపటం మన దేశంలో ప్రాచీనకాలం నుండి కొనసాగుతున్నది. ఆనాడు ప్రజలు ఋషులు రాజులు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి స్వంత నైతిక భాద్యతగా భావించేవారు. హరప్పాకాలం నాటి లోహరి పండుగ మొదలు నేటి బతుకమ్మ, తీజ్ పండుగల వరకు అన్నీ కూడా ప్రకృతిహిత ప్రాతిపదిక గల పండుగలే. అఖండ భారతాన్నేలిన అశోకుడు చెట్లను పెంచుటకు శాసనాలు చేసి రోడ్లకిరువైపుల చెట్లను నాటించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడి వనప్రేమికుడుగా చరిత్రలో నిలిచాడు. నేటి ఆధునికకాలంలో మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు ముమ్మరంగా  అమలు చేయబడుతున్నాయి.

 పచ్చదనం మరియు పరిశుభ్రతలను పెంపొందించే లక్ష్యంతో  ప్రజల జీవన నాణ్యత మెరుగుదల కోసం ప్రపంచ ప్రజల జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల వారి పర్యావరణ ప్రవర్తనలో సానుకూల మార్పులను ప్రోత్సహించడానికి ప్రజల భాగస్వామ్యంతో ఇటీవల పర్యావరణం కోసం జీవనశైలి (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్-లైఫ్) అనే పరివర్తనోద్యమ కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు యువతలో పర్యావరణ స్పృహను ప్రోత్సహించడానికి  పాఠశాల స్థాయిలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్ జిసి) అధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలలో పర్యావరణ క్లబ్ లు పనిచేస్తున్నాయి. 2025 సంవత్సరం నుండి ఈ  పర్యావరణ క్లబ్ లకు ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ గా కేంద్ర ప్రభుత్వం  పునర్  నామకరణం చేసింది.                   

పరివర్తనోద్యమంగా లైఫ్ ప్రోగ్రాం : భూమి దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం సమస్తజీవరాశులతో పాటు మానవాళి శ్రేయస్సు కోసం  ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు  2021 నవంబర్ 1న యూఎన్ఓ ఆధ్వర్యంలో వాతావరణమార్పులపై గ్లాస్గో లో  జరిగిన కాప్-26 సదస్సులో పర్యావరణం కోసం జీవనశైలి అనే ప్రపంచ స్థాయి   ప్రజల ప్రవర్తనా పరివర్తనోద్యమ భావనకు  భారతదేశం అంకురార్పణ చేసింది . దీనిని 5 జూన్ 2022  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంధర్భంగా లాంచనంగా  ప్రారంభించింది. ఈ రోజు నుంచి  పర్యావరణస్పృహతో కూడిన జీవనశైలిని అవలంభించడానికి ప్రజలను ప్రభావితం చేయడానికి విద్యావేత్తలు పర్యావరణనిపుణులు ప్రజల నుండి సానుకూల ఆలోచనలను ఆహ్వానిస్తూ లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్ అనే కార్యక్రమం ఆరంభమైంది. ప్రజలలో  పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రోత్సహించడం ప్రొ ప్లానేట్ పీపుల్ ( పి3 )  భాగస్వామ్య నిబద్దతను పెంపొందించడం పర్యావరణ అనుకూల ప్రవర్తనలను స్వయంబలోపేతం చేయడం  లైఫ్ ప్రోగ్రామ్   యొక్క  ప్రధాన ఉద్దేశ్యాలు. 2028 నాటికి భారతదేశంలో కనీసం 80 శాతం పల్లెలు మరియు పట్టణాలు ఎకో ఫ్రెండ్లీ ప్రదేశాలుగా మార్పు చెందటం  మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ అంచనగా   ఉంది. ఈ ఉద్యమం  భూగ్రహానికి హాని కలిగించని జీవితాన్ని గడుపడానికి ప్రతి వ్యక్తికి వ్యక్తిగత  లేదా సామూహిక కర్తవ్యాలను  తెలియజేస్తుంది. విద్యుత్ పొదుపు నీటిపొదుపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం సాధారణవ్యర్థాలను తగ్గించడం  ఎలక్ట్రానిక్ వ్యర్థాలను  తగ్గించడం స్థిరమైనఆహార విధానాన్ని అమలుచేయడం ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవరుచుకోవడం వంటి ఏడు  పర్యావరణహిత  అంశాల అమలు ఈ ఉద్యమంలో ప్రధానమైనవి.

    ఇటీవలీ కాలంలో మన దేశంలో  ప్రవేశపెట్టబడిన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, స్వచ్చ భారత్గ్రీన్ క్రెడిట్ పోగ్రామ్, పంచామృత్, ప్రాణం, నమామిగంగే, గోబర్ ధాన్, నగర్ వన్ స్కీమ్ జల్ జీవన్ మిషన్, అటల్ భూజల్  యోజన  జాతీయ అటవీ పెంపకం  కార్యక్రమం, నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ క్యాచ్ ది రెయిన్ వంటి పర్యావరణ కార్యక్రమాలకు మిషన్ లైఫ్ ప్రోగ్రామ్  మార్గనిర్దేశనం చేస్తున్నది. కనుక లైఫ్ కార్యక్రమం ప్రారంభాన్ని కొనియాడుతూ భారతదేశం ప్రపంచ పర్యావరణ చర్యకు కేంద్రంగా ఉంది అని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్  అధిపతి  ఇంగర్ఆండర్సన్ అభినందించడం  భారతీయుల పర్యావరణదార్శనికతకు నిదర్శనంగా ఉంది.

    పర్యావరణస్నేహితులుగా ఎకో క్లబ్ లు :  నేడు  ప్రపంచవ్యాప్తంగా సుమారు 79 శాతం ప్రజలు పర్యావరణశోకం (ఎన్విరాన్మెంటల్ గ్రీఫ్)తో  పరివరణవ్యవస్థ పట్ల ఆందోళన చెందుతున్నారని పలుపరిశోధనలు పేర్కొంటున్నాయి. సుస్థిర పర్యావరణ అభివృద్ది లక్ష్యాల సాధనా ఆకాంక్షలు పర్యావరణ ఉద్యమ ఉద్దేశ్యాలు నెరవేరాలంటే అందుకు తగ్గట్టుగా విద్యార్థులలో, ప్రజలలో పర్యావరణ ప్రవర్తనలో మార్పులు తీసుకరావలసిన అవసరం ఎంతగానో  ఉంది. పాఠశాల స్థాయి నుండే  విద్యార్థులలో పర్యావరణ స్పృహను కలిగించడానికి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రతి స్కూల్ లో ఎకో క్లబ్ లను ఏర్పాటు చేసింది. మన దేశంలో నేషనల్ గ్రీన్ కార్ప్స్  ద్వారా సుమారులక్షల పర్యావరణ క్లబ్ లు ఏర్పాటయినవి. మన రాష్ట్రంలో సుమారు 50 వేల  ఎకోక్లబ్ లు పనిచేస్తున్నాయిప్రతి పాఠశాల ఎకోక్లబ్ లో నీటినిల్వ క్లబ్ నేలనిర్వహణ క్లబ్, శక్తినిర్వాహణ క్లబ్.  వ్యర్థ నిర్వాహణ క్లబ్ మరియు జీవవైవిధ్య క్లబ్ అను ఐదు ఉపక్లబ్ ల ద్వారా కార్యకలాపాలు నిర్వహించబడుతాయి. ఒక్కొక్క ఉప క్లబ్ లో 10 మంది విద్యార్థులు చొప్పున మొత్తం 30 నుండి  50 మంది విద్యార్థులు ఉంటారు. గ్రీన్ టీచర్ ఇంచార్జి గా ఉంటారుఈ క్లబ్ ల ద్వార శక్తి అదా నీటి పొదుపు  ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ స్థిరమైన ఆహార వ్యవస్థలు, వ్యర్థాల తగ్గింపు ఆరోగ్యకర జీవన శైలి మరియు ఈ వ్యర్థాల నిర్వాహణ అను ఏడు అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి. తాజాగా  రాష్ట్ర, జాతీయ స్థాయిలలో స్వచ్చదనంపచ్చదనం వన మహోత్సవం నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటిషన్ (ఎన్ఎస్ పిసి-2025) మట్టి వినాయకుల తయారితల్లి పేరున చెట్టు నాటడం ( ఏ ట్రీ ఫర్ మదర్) తదితర కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎకో క్లబ్ లు విరివిగా కృషి చేస్తున్నాయి

తల్లికి చెట్టుసమాజానికి సందేశం : పర్యావరణ పరిరక్షణలో పిల్లలతో పాటు తల్లుల భాగస్వామ్యంను ప్రోత్సహించడం కోసం 5 జూన్ 2024 ప్రపంచ  పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏక్ పెడ్ మా కే నామ్ (తల్లి పేరుతో ఒక  చెట్టు నాటడంఉద్యమ భావనను కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ  ప్రారంభించింది. ఈ భావనలో తల్లి పట్ల కృతజ్ఞత, ప్రకృతి పట్ల భాద్యత అను రెండు విలువలు దాగి ఉన్నాయిప్రతి ఒక్కరిలో వారి తల్లి పట్ల ప్రేమ గౌరవ భావనలను పెంచడం కోసం వారి జ్ఞాపకాలను శాశ్వతం చేయడం కోసం  తల్లి పేరున ఒక చెట్టును నాటడం  పథకం ప్రధాన ఉద్దేశ్యం. తల్లి పేరుతో చెట్టు నాటితే అది కేవలం వ్యక్తిగత బహుమతే కాదు భవిష్యత్ తరాలకు అమూల్యమైన ఆస్థి అనే సందేశం సమాజానికి అందుతుంది. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో ఒక మొక్క నాటితే లక్షలాది చెట్లు పెరిగి మన దేశం  హరిత భారత్ (గ్రీన్ ఇండియాగా మారుతుందిఈ కార్యక్రమంలో భాగంగా 24 సెప్టెంబర్ 2024  ఒకే రోజు ఒక గంటలో 5 లక్షల మొక్కలను నాటడం ద్వారా ప్రపంచ స్థాయి రికార్డు నెలకొల్పబడిందిభూగ్రహం ఆరోగ్యానికి దోహదపడపడటం లో తల్లుల పాత్రను గౌరవించడం తల్లి లాగే చెట్లు జీవితాలను నిలబెట్టి తదుపరి తరానికి జీవనోపాదిని భవిష్యత్తు తరాలకు  అందిస్థాయి. డిసెంబర్ 2024 నాటికీ దేశవ్యాప్తంగా సుమారు 102 కోట్లకు పైగా మొక్కలను నాటినట్లు మేరి లైఫ్ పోర్టల్ లో పేర్కొనబడింది. ఈ కార్యక్రమం 31 మార్చి 2026 న ముగియనున్నది. లైఫ్ ప్రోగ్రాం స్పూర్తితో  ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో గ్రీన్ గ్యాదరింగ్ పేరున పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు యువత విద్యార్థులు అందమైన ప్రకృతిని ఆరాధించడం పరిరక్షించడం సంరక్షించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలిమానవుడు ప్రకృతిని జయించటం కాదు ప్రకృతితో సామరస్యంగా మెలిగి నైతికత విలువలను పాటిస్తూ పర్యావరణ అనుకూల జీవనశైలిని ఒక తాత్విక జీవన విధానంగా భావించి జీవించటం నేర్చుకోవాలి. ఇది నేటి ప్రజల సామజిక అవసరం. 

-  డాక్టర్ భారత రవీందర్ 

(వ్యాసరచయిత ‘సైన్స్ రచయిత & పర్యావరణనిపుణులు’)

#MissionLiFE #EcoClubs #GreenIndia #SustainableLifestyle #ProPlanetPeople #SaveEnvironment
#GoGreen #ClimateAction #PlasticFreeFuture #EcoFriendlyLiving

Disclaimer:

The views expressed in this article are solely those of the author. The content is meant purely for healthy public discourse, critical analysis, and academic discussion.

© 2025 Bharatha Sudarshan | Bharatha360.com

All rights reserved. No part of this article may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the author, except in the case of brief quotations embodied in critical reviews and certain other non-commercial uses permitted by copyright law.

Comments

Popular posts from this blog

వెనుజులా సంక్షోభం : చమురు ఉన్నా చీకట్లోనేనా దేశ భవిష్యత్తు? i Venezuela Crisis: Despite Having Oil, Is the Country's Future Still in Darkness?

"జపాన్ బాబా వంగా" భవిష్యవాణి ప్రపంచాన్ని ఎందుకు కదిలించింది? I Why the “Japan’s Baba Vanga” Prediction Shook the World ? I Bharatha Sudarshan, Socio-Political Analyst

"ట్రంప్ 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'లో ఏముంది?" I What’s Inside Trump’s 'Big Beautiful Bill'?