Posts

Showing posts from May, 2025

సంక్షోభంలో జీవవైవిధ్య సంపద ఎందుకు? I "Biodiversity on the Brink: A Global Crisis in the Making"

Image
    ప్రకృతిలో ఏ జీవి ఒంటరిగా జీవించలేదు . ప్రతి ప్రాణి తన చుట్టూ ఉన్న పరిసరాలపై , ఇతర జీవరాశులపై ఆవాసం ఆహారం ప్రత్యుత్పత్తిల కోసం ఆధారపడుతుంది . ప్రకృతిలో  మానవునితో సహా జీవులన్నీఎన్నో భేదాలను కలిగి ఉండి కూడా   పరస్పరాధారిత జీవనం గడుపుతాయి . జీవులలో గల భేదాలన్నిటిని కలిపి జీవవైవిధ్యం ( బయో డైవర్సిటి ) అని పిలుస్తారు .   ఇది భవిష్యత్ తరాలకు ఉమ్మడి ఆస్థి . మానవునికి ఆహారం ఆరోగ్యంలతో పాటు ఆర్థిక సామజిక నైతిక రసాత్మాక విలువలను పెంపోందిస్తుంది . నేడు అభివృద్ది  ఆధునికత  సాంకేతికతల పేరుతో మానవుడు మితిమీరిన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిలోని వివిధరకాలైన జీవుల వినాశనానికి పాల్పడుతున్నాడు .  భూమిపై విపరీత వాతావరణ మార్పులు , భూతాపం , భూఅతిచల్లదనం , భారి అగ్నిపర్వతాల పేలుడు , గ్రహశకలాలు డీకోట్టడం వంటి కారణాల వల్ల ఇప్పటికే భూమిపై సుదీర్ఘ కాలవ్యవధులలో ఐదు మహాజీవ అంతర్ధాన సంఘటనలు జరిగాయి. ఈ సాముహిక జీవవినాశన ప్రక్రియలలో భూమిపై గల జీవులలలో ప్రతిసారి మూడొంతులకు పైగా జీవులు కనుమరుగు అయినాయి . సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఐదవమహావిలుప్తంల...

భారత్ 'పాక్' ను పాలించాలి! : ప్రజల నిరసనలు, మారుతున్న చైతన్యం I "India Should Govern Pakistan! – Rising Voices, Fading Fears"

Image
  అవునూ..మీరు చదువుతున్నది నిజమే!. ఇదే ఏమాత్రం హాస్యాస్పదమైన అంశం కాదు. గుండెల్లో భయం , కడుపులో ఆకలి , చేతిలో నిదాన మరణం!. లూటీ పాలకులు ఏటా వేల కోట్లను దోచేస్తుంటే – ప్రజల జీవితాల్లో ఒక్క రూపాయి వెలుగు లేదు. "ఇది దేశం కాదు … దహనశాల! అంటూ లక్షాలాది పాకిస్తాన్ ప్రజలు రోజూ మౌనంగా రోదిస్తున్నారు , శవాల్లా బతికేస్తున్నారు. ఇటీవల లాహోర్‌ , పేషావర్ , సిన్నర్‌ వంటి నగరాల్లో జరిగిన , జరుగుతున్న నిరసనలు ఈసారి భిన్నంగా ఉన్నాయి. మన దేశాన్ని పాలించే వారికి మానవతా విలువలు లేవు. “ ఇదెంతకాలం ?   అన్న పదాలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.   అనివార్యంగా   మారిన ఈ దుస్థితి నుండి పాక్ ప్రజలు తేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వారి నోటివెంట తమను ' భారతే పాలించాలి! ' అనే నినాదాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ , ఇప్పుడు యుద్ధ సమయంలోనూ పాక్ సామాన్య ప్రజలు అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాలను వెల్లడించడం మనకు తెలిసిందే. ఇదేదో సాహసోపేతమైన కల కాదు... ఇది పాకిస్తాన్ ప్రజల నేటి నిశ్వాసం. పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న దారుణ పాలన , అతలాకుతలమైన ఆర్థిక , సామాజిక , రాజకీయ వ్యవస్థ...

భారత్ ఎందుకు ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు? | Why India Never Accepts Mediation?

Image
  భారతదేశం అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ఒక స్పష్టమైన విదేశాంగ దృక్పథాన్ని పాటిస్తూ వస్తోంది — అది మధ్యవర్తిత్వాన్ని (Mediation) ఖచ్చితంగా తిరస్కరించడం. ఇది భారత్-పాకిస్తాన్ వివాదం అయినా కావచ్చు, భారత్-చైనా ఘర్షణ అయినా కావచ్చు — భారత్ ఎప్పటికీ మూడవ పక్షం జోక్యాన్ని అంగీకరించలేదు. "India has never accepted mediation in any dispute, be it India-Pakistan or India-China, or any other,” అవును ఇది నిజమే — భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఒక స్థిరమైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ, ఏవైనా రెండు పక్షాల మధ్య వివాదాల్లో మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని నిరాకరిస్తూ వస్తోంది. కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే..: భారత్-పాకిస్తాన్ అంశం (కశ్మీర్ వివాదం): పాకిస్తాన్ తరచూ ఐక్యరాజ్యసమితి లేదా అమెరికా వంటి దేశాలను మధ్యవర్తులుగా నిలబెట్టేందుకు ప్రయత్నించింది. కానీ భారతదేశం ఎన్నడు కూడా దానిని అంగీకరించలేదు. “ఇది ద్వైపాక్షిక అంశం. భారత్-పాకిస్తాన్ మధ్యనే పరిష్కరించాల"ని భారత్ ధృఢంగా చెబుతూనే ఉంది. భారత్-చైనా వివాదాలు : డోక్లాం (2017), గల్వాన్ ఘర్షణ (2020) వంటి ఉదంతాల్లో కూడా భారత్ ఏ విదేశీ దేశపు మధ్యవర్తి...

గగనతలంలో ‘భారత సుదర్శన చక్ర’ (S-400) గర్జన! I "Roar of 'India's Sudarshana Chakra' in the sky!"

Image
  భారతదేశ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆ రాత్రి ఏం జరిగిందంటే..! భారతదేశానికి అతి సమీపంలో ఉన్న ఆకాశంలో  2025 మే 7 రాత్రిన  పాకిస్తాన్ నుండి ప్రయోగించిన 25 కి పైగా డ్రోన్లు , మిస్సైళ్లకు కౌంటర్ ఇచ్చిన భారత్..   ఇలా మొదలైంది... అది సాధారణమైన రాత్రి కానేకాదు... దట్టమైన పొగమంచును చీల్చుకుంటూ పాకిస్థాన్ వైపు నుండి వెల్లువలా వస్తున్న డ్రోన్లు , బాలిస్టిక్ మిస్సైళ్లకు లక్ష్యాలుగా భారత్ లోని ప్రధాన నగరాలైన  ఢిల్లీ , జైపూర్ , జోధ్‌పూర్ , శ్రీనగర్ , పఠాన్‌కోట్ లాంటి దాదాపు  15 నగరాలు లక్ష్యంగా చేసుకోబడ్డాయి.. అయితే , పాక్‌కి తెలియన విషయం ఏంటంటే.. " భారత రక్షణ శక్తి ‘ గద్దలా ’ మేల్కొని ఉంది!"   ఎంట్రీ ఆఫ్ ద మాస్టర్ - "సుదర్శన్ చక్ర (S-400)"! మన దేశ పశ్చిమ సరిహద్దు గుండా వేట మొదలయింది... కానీ భారత వాయుసేన ఇప్పటికే "ఎస్ఫోర్ హండ్ రెడ్  alert" పై ఉంది. సరిగ్గా అప్పుడే, అత్యంత వేగంగా దూసుకొచ్చే శత్రుదేశ క్షిపణులను చీల్చిచెండాడేందుకు ‘భారత సుదర్శన చక్ర (ఎస్-400)’ యుద్ధ రణరంగంలో ప్రవేశించింది. ‘సుదర్శన చక్ర’ అంటే ఏదో సాదాసీదా పరికరం కాదు..ప్...