భారత్ ఎందుకు ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు? | Why India Never Accepts Mediation?
భారతదేశం అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ఒక స్పష్టమైన విదేశాంగ దృక్పథాన్ని పాటిస్తూ వస్తోంది — అది మధ్యవర్తిత్వాన్ని (Mediation) ఖచ్చితంగా తిరస్కరించడం. ఇది భారత్-పాకిస్తాన్ వివాదం అయినా కావచ్చు, భారత్-చైనా ఘర్షణ అయినా కావచ్చు — భారత్ ఎప్పటికీ మూడవ పక్షం జోక్యాన్ని అంగీకరించలేదు.
"India has never accepted mediation in any dispute, be it India-Pakistan or India-China, or any other,”
అవును ఇది నిజమే — భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఒక స్థిరమైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ, ఏవైనా రెండు పక్షాల మధ్య వివాదాల్లో మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని నిరాకరిస్తూ వస్తోంది.
కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే..:
భారత్-పాకిస్తాన్ అంశం (కశ్మీర్ వివాదం):
పాకిస్తాన్ తరచూ ఐక్యరాజ్యసమితి లేదా అమెరికా వంటి దేశాలను మధ్యవర్తులుగా నిలబెట్టేందుకు ప్రయత్నించింది. కానీ భారతదేశం ఎన్నడు కూడా దానిని అంగీకరించలేదు. “ఇది ద్వైపాక్షిక అంశం. భారత్-పాకిస్తాన్ మధ్యనే పరిష్కరించాల"ని భారత్ ధృఢంగా చెబుతూనే ఉంది.
భారత్-చైనా వివాదాలు :
డోక్లాం (2017), గల్వాన్ ఘర్షణ (2020) వంటి ఉదంతాల్లో కూడా భారత్ ఏ విదేశీ దేశపు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదు. చర్చలు ద్వైపాక్షికంగా జరుగుతాయి, మధ్యవర్తుల అవసరం లేదని భారత్ తేల్చి చెప్పింది.
2019 లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య “భారత్ ప్రధాన మంత్రి మోదీ నన్ను కశ్మీర్ విషయంలో మధ్యవర్తిగా ఉండమన్నార"ని తెలిపారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెంటనే ఖండించి, అలాంటి అభ్యర్థన ఎప్పుడూ చేయలేదని స్పష్టంగా చెప్పింది.
'మధ్పవర్తిత్వం' ఎందుకు అంగీకరించదు? :
భారత సార్వభౌమత్వం (Sovereignty) – ఇతర దేశాల జోక్యం లేకుండా స్వయంగా సమస్యలను పరిష్కరించాలన్న ధోరణిని పాటిస్తున్నది. మూడవ పక్షం తటస్థంగా ఉండకపోవచ్చని భారత్ నమ్మకలేమిని కలిగి ఉంది. సమస్యలను ప్రత్యక్షంగా పక్షాలు కలిసి మాట్లాడుకోవడమే ఉత్తమ మార్గమని ద్వైపాక్షిక చర్చల మీదనే భారత్ విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నది. ఇలాంటి
వెన్నో ఉదాహరణలను పరిశీలిస్తే “భారతదేశం ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదు” అన్నది వాస్తవమే. గ్లోబల్ స్టేజీలో భారత్ తన నైతిక స్థిరత్వాన్ని నిరూపించుకుంది — కఠిన పరిస్థితుల్లో కూడా తలదించుకోని ధీరత్వం చూపింది. గణరాజ్య స్థిరతను భారత్ చాటుకుంటున్నది.
🇮🇳 ఇది నూతన భారత్ :
ఈరోజు “ఆపరేషన్ సిందూర్”తో ప్రపంచం భారత్ యొక్క దృఢ సంకల్పాన్ని చూస్తోంది. భారతదేశం ఒక శాంతికాముక దేశం, కానీ అవసరమైతే శక్తివంతమైన సమాధానాలు కూడా ఇవ్వగలదు. మూడవ పక్షం అవసరం లేదని నిరూపించింది.
"న తు త్వం శంక్యతుమర్హసి యుధ్యస్వ విజయస్యసి"
(భగవద్గీత: ధర్మ యుద్ధంలో నీ విజయం ఖచ్చితం; కాబట్టి పోరాటానికి సిద్ధమవు)
✍️ Bharatha Sudarshan
Social-Political Analyst
🔖 ట్యాగులు:
#Bharatha360 #IndiaForeignPolicy #NoMediation #OperationSindhoor #IndiaChina #IndiaPakistan #NationalPride #Geopolitics #BharatFirst #SocialPoliticalAnalysis

Comments
Post a Comment