హరిత పర్యావరణవాదమే శ్రేయస్కరం అనాది నుండి మానవుడు పర్యావరణ స్పృహ కలిగియుండి ప్రకృతితో మమేకమై జీవిస్తు ఉండేవాడు . కానీ నేడు మనిషి శాస్త్ర సాంకేతిక పరిశోధనలు నూతన ఆవిష్కరణలతో ప్రకృతి గోళాన్ని మరిచి విజ్ఞానగోళంలో విహరిస్తున్నాడు . సకల జీవరాశుల ఉమ్మడి ప్రయోజనాలను మరచి అభివృద్ధి ఆధునికతల జీవనశైలి మాటున అత్యాశ అవసరాలు తీర్చుకోవడానికి సహజ వనరులను విద్గ్వంసం చేస్తూ పర్యావరణ సంక్షోభంలో కూరుకుపోతున్నాడు . భూఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్ళెం వేయాలన్న పారిస్ ఒప్పందం అమలు ఎండమావిగానే మిగిలిపోతున్నది . ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు 1972లో స్టాక్‌హోమ్ ( స్వీడన్ ) లో యూఎన్ఓ అధ్వర్యంలో జరిగిన మానవుడు- పర్యావరణం అంతర్జాతీయ సదస్సు లో ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ( వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ) ను జరుపుకోవాలని సభ్యదేశాలు నిర్ణయించాయి . మొట్టమొదట 1973 జూన్ 5 "ఒకే ఒక భూమి" అనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినమును ప్రపంచదేశాలన్నీ జరుపుకున్నాయి. ఈ ...