"జపాన్ బాబా వంగా" భవిష్యవాణి ప్రపంచాన్ని ఎందుకు కదిలించింది? I Why the “Japan’s Baba Vanga” Prediction Shook the World ? I Bharatha Sudarshan, Socio-Political Analyst

 


    ప్రపంచం మొత్తం ఒక విచిత్ర వాతావరణంలో ఉంది. ఎక్కడైనా ప్రకృతి మార్పులు, భూకంపాలు, వాతావరణ విపత్తులు జరుగుతున్న తరుణంలో, ఇప్పుడు జపాన్‌కి చెందిన ఓ మాంగా ఆర్టిస్ట్ చేసిన భవిష్యవాణిచర్చనీయాంశమైంది. ఆమె పేరు ర్యో తత్సుకి’. మంగా గ్రాఫిక్స్ ఆధారంగా రాసిన ఆమె పుస్తకం పేరు "The Future I Saw". ప్రపంచవ్యాప్తంగా ఆమెను ఇప్పుడు "జపాన్ బాబా వంగా" అని పిలుస్తున్నారు. మరి ఆమె నిజంగా భవిష్యవాణులు చెబుతోందా? లేక ఇది భయానక కలల ప్రభావమా?. ఇంతకూ...

 

ఎవరీ ‘ర్యో తత్సుకి’? :

ర్యో తత్సుకి (Ryo Tatsuki)జపాన్‌కు చెందిన ఒక మంగాకా (manga artist), ఆర్టిస్ట్, రచయిత్రి. ఆమె పేరు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావడానికి కారణం ఆమె రాసిన "The Future I Saw" అనే మాంగా పుస్తకం ప్రథమంగా 1999లో విడుదలైంది, 2021లో పునఃప్రచురించబడింది. ఆమె ప్రత్యేకత ఏంటంటే.. ఆమెకు కలల రూపంలో భవిష్య విషయాలు ప్రత్యక్షమవుతాయని ఆమె చెబుతుంది. వాటిని కథలుగా మలిచి మంగాల్లో చిత్రీకరిస్తుంది. బల్గేరియాలో ప్రసిద్ధమైన భవిష్యవక్త బాబా వంగాలాగే, ర్యో తత్సుకి కూడా తన కలల ఆధారంగా భవిష్యవాణులు చేసినట్లు చెబుతుంది. ఆమె కలల డైరీలో పలు సంఘటనలు నిజమవడాన్ని సూచిస్తూ ఆమెను "జపాన్ బాబా వంగా" అని పిలవడం మొదలైంది. ఆమె కలల డైరీలో ఉన్న ముఖ్యమైన అంచనాలు.. ప్రిన్సెస్ డయానా మరణం, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం. కోబే భూకంపం. 2011 సునామీ. కోవిడ్-19 మహమ్మారి లు ఉన్నాయి. తాజాగా 2025 జూలై 5: భారీ విపత్తు కూడా ఉన్నట్లు తెలుపుతున్నది. తత్సుకి తన కలలను గౌరవంగా చూసి వాటిని పుస్తకాలుగా మార్చింది. ఆమె భవిష్యదృష్టి శాస్త్రీయ ఆధారాలపై కాకుండా, ఆత్మీయ అనుభూతులపైనే ఆధారపడి ఉంటుంది. తాను దేవుడు కాదు, శాస్త్రవేత్త కాదు కానీ కలలు నిజమయ్యే అవకాశం ఉన్నాయని చెప్పడమే తన ఉద్దేశమని ర్యో తత్సుకి అంటుంది.

 

 "The Future I Saw" లో ఏమున్నది? :

The Future I Saw పుస్తకం అనేది ర్యో తత్సుకి రాసిన ఓ వింత పుస్తకం. ఇది భవిష్యవాణుల మాలికలా ఉంటుంది. కానీ ఇది కాలజ్ఞానం ఆధారంగా కాదు, కలల ఆధారంగా రాయబడింది. రచయిత్రికి భవిష్యత్ ను సూచించే కలలు వస్తాయని, ఆమె కలలను డేట్స్, డ్రాయింగ్ లు, వివరణలతో డైరీలా రాసింది. వాటిలో కొన్ని సంఘటనలు నిజమయ్యాయని ఆమె అనుచరులు విశ్వసిస్తున్నారు. ఆమె కలల్లో తరచూ కనిపించే ఒఖ మిస్టీరియస్ పెద్ద మనిషి, భవిష్య విషయాలను తెలిపే పాత్రగా ఉంటుంది. అతని మాటల ఆధారంగా కూడా కొన్ని హెచ్చరికలు ఉంటాయని పుస్తకంలో ఉంది. 1999లో ప్రచురితమైన ఈ మాంగా పుస్తకం కవర్‌పైనే ఆమె ఒక పెద్ద భయాన్ని హెచ్చరించింది: “2021 మార్చిలో పెద్ద విపత్తునూ సూచించింది. ఈ మాటలు విన్నవారు, చూసినవారు మొదటగా దీన్ని అపహాస్యంగా తీసుకున్నారు. కానీ, 2011లో వచ్చిన జపాన్ టోహోకు భూకంపం, సునామీ, ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత చాలామంది ఆమెను అద్భుత దృక్శక్తి గలవారిగా చూస్తున్నారు. ఈ సంఘటనతో ఆమె పుస్తకానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. 2021లో పునర్ముద్రణలో ఆమె తన కలల డైరీని జోడించి, మరిన్ని వివరాలు చేర్చింది.

 

 జూలై 5, 2025 – విపత్తు రూమర్ తో భారీ నష్టం  :

ర్యో తత్సుకి తన కలల్లో 2025 జూలై 5 తేదీ గురించి స్పష్టంగా హెచ్చరింది. ఆమె కలల్లో... జపాన్ దక్షిణంలో సముద్రం మరిగిపోతూ కనిపించింది. భూమిలో చీలికలు, భారీ భూకంప లక్షణాలు కనిపించాయి. గత సునామీల కంటే 3 రెట్లు పెద్ద సునామీ వచ్చే ప్రమాద సూచనలున్నాయి. దీని ప్రభావం జపాన్ మాత్రమే కాకుండా తైవాన్, ఇండోనేషియా, మరియానా దీవుల వరకు ఉంటుందని పేర్కొంది.ఈ కలల కారణంగా ఇటీవలే జపాన్‌కు టూరిజం తీవ్రంగా తగ్గిపోయింది. విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ సగం కంటే ఎక్కువ రద్దయ్యాయి. సోషల్ మీడియాలో ర్యో తత్సుకి జూలై 5న భారీ విపత్తు (megaquake + tsunami) వస్తుందని మాట ప్రసారం అయ్యింది. ఇందుకు సృష్టించిన పానిక్ వలన టూరిజం, విమాన బుకింగ్స్ ప్రభావితమయ్యాయి . ¥560 బిలియన్ల (అంటే సుమారు US$3.9 బిలియన్) ఆర్థిక నష్టం అనేది భారత రూపాయల్లో సుమారుగా ₹32,370 కోట్లకు సమానం. ఇది ఒక్క రూమర్ వల్ల జరిగిన ప్యానిక్‌కు ప్రపంచ స్థాయి టూరిజం ఎకానమీ ఎలా ప్రభావితమవుతుందో చూపించే బలమైన ఉదాహరణ.

 

శాస్త్రీయంగా ఏమంటున్నారు? :

"ఇలాంటి భవిష్యవాణులకు శాస్త్రీయ ఆధారం లేదు." అని జపాన్ వాతావరణ శాఖ, భూగర్భ పరిశోధన సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అయినా ప్రజల మదిలో భయం తొలగడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, మీమ్స్, వార్తలు దీనిని మరింత పెంచుతున్నాయి. పునరావృత కలలు, సామూహిక అనుమానాలు, పాప్యులర్ కల్చర్—all mix అవడంతో ఈ విషయం ఒక "Mass Psychology" study గా మారుతోంది. నిజానికి ఇది మన భయం ప్రతిబింబమేనా? అనేలా చేస్తున్నది. ర్యో తత్సుకి కలలు నిజమా కాదా అనేది తేల్చడం కష్టం. కానీ ఇవి మనలోని అస్థిరతను, భవిష్యత్తుపై ఉన్న భయాన్ని బయటపెడుతున్నాయన్నది వాస్తవం. కోవిడ్ (COVID-19) తర్వాత ప్రపంచం గంభీర మార్పులకు లోనైంది. మానవుడు ఇప్పుడు ప్రకృతిని గౌరవించాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్న తరుణంలో ఈ తరహా హెచ్చరికలు కూడా మనల్ని ఆలోచించుకునేలా చేస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలో తత్సుకి చేసిన భవిష్యవాణులకు ఆధారం లేదు. కానీ, మానవ మేధస్సు, కలలు, చైతన్యం అనే విషయాల్లో ఆసక్తి కలిగినవారికి ఆమె రచనలు ఆసక్తికరంగా ఉంటాయి. వ్యాఖ్యలు, కలలు, మాంగాలు ఇవన్నీ ఒక సంఘటనపై దృష్టి ఆకర్షించే సాధనాలే. కానీ, బాధ్యతాయుతమైన దృష్టితో చూసే వేళ ఇది మనం ప్రకృతిని గౌరవించాలి, తత్సుకి తన మొట్టిమొదటి వ్యాఖ్యలలో కూడా చదివిన పాఠకులకు "నా మాటలను పూర్తిగా నమ్మవద్దు; శాస్త్రవేత్తల సూచనలను అనుసరించండి" అని సూచించింది . శాస్త్రాన్ని వినాలి, కానీ భావోద్వేగాల్లో మునిగిపోకూడదు అనే గుర్తింపునిస్తుంది. జూలై 5 లాంటివి రావచ్చు.. వెళ్లిపోవచ్చు. కానీ మన చింతన మార్చితే.. మన భవిష్యత్తు మారుతుంది.

-

భారత సుదర్శన్

సామాజిక రాజకీయ విశ్లేషకులు Bharatha360.com

#RyoTatsukiPredictions #JapanBabaVanga #TheFutureISawBook #2025July5TsunamiPrediction #RyoTatsukiDreams #MassPanicduetoPredictions #భవిష్యవాణిyapanmangaartist #ర్యోతత్సుకికలలు #భారతసుదర్శన్విశ్లేషణ #BabaVangaofJapan #Masspsychologybehindfear #Telugusociopoliticalanalysis #భవిష్యవాణివల్లఆర్థికనష్టం #PredictionsandPublicReactions #జపాన్బాబావంగాభయాలు #Tsunamipredictionpanic2025 #భవిష్యవాణిపైశాస్త్రీయవిశ్లేషణ #Fakeprophecyimpactontourism #Bharatha360blogarticles #RyoTatsukiTeluguanalysis

 

Disclaimer: “The views expressed in this article are solely those of the author. The content is meant purely for healthy public discourse, critical analysis, and academic discussion.”

#PakistanCrisis #IndiaPakistanRelations #OperationSindhoor #Geopolitics #BharathaSudarshan #Bharatha360 #UNIntervention #FailedState #SouthAsiaPeace #IndiaAsPeacekeeper

© 2025 Bharatha Sudarshan | Bharatha360.com

All rights reserved. No part of this article may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the author, except in the case of brief quotations embodied in critical reviews and certain other non-commercial uses permitted by copyright law.

Comments

Popular posts from this blog

వెనుజులా సంక్షోభం : చమురు ఉన్నా చీకట్లోనేనా దేశ భవిష్యత్తు? i Venezuela Crisis: Despite Having Oil, Is the Country's Future Still in Darkness?

"ట్రంప్ 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'లో ఏముంది?" I What’s Inside Trump’s 'Big Beautiful Bill'?