గగనతలంలో ‘భారత సుదర్శన చక్ర’ (S-400) గర్జన! I "Roar of 'India's Sudarshana Chakra' in the sky!"


 

భారతదేశ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆ రాత్రి ఏం జరిగిందంటే..!

భారతదేశానికి అతి సమీపంలో ఉన్న ఆకాశంలో 
2025 మే 7 రాత్రిన 
పాకిస్తాన్ నుండి ప్రయోగించిన 25కి పైగా డ్రోన్లు, మిస్సైళ్లకు కౌంటర్ ఇచ్చిన భారత్..

 

ఇలా మొదలైంది...

అది సాధారణమైన రాత్రి కానేకాదు... దట్టమైన పొగమంచును చీల్చుకుంటూ పాకిస్థాన్ వైపు నుండి వెల్లువలా వస్తున్న డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లకు లక్ష్యాలుగా భారత్ లోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, శ్రీనగర్, పఠాన్‌కోట్ లాంటి దాదాపు 15 నగరాలు లక్ష్యంగా చేసుకోబడ్డాయి..

అయితే, పాక్‌కి తెలియన విషయం ఏంటంటే..
"
భారత రక్షణ శక్తి గద్దలామేల్కొని ఉంది!"

 

ఎంట్రీ ఆఫ్ ద మాస్టర్ - "సుదర్శన్ చక్ర (S-400)"!

మన దేశ పశ్చిమ సరిహద్దు గుండా వేట మొదలయింది... కానీ భారత వాయుసేన ఇప్పటికే "ఎస్ఫోర్ హండ్ రెడ్ alert" పై ఉంది.

సరిగ్గా అప్పుడే,

అత్యంత వేగంగా దూసుకొచ్చే శత్రుదేశ క్షిపణులను చీల్చిచెండాడేందుకు ‘భారత సుదర్శన చక్ర (ఎస్-400)’ యుద్ధ రణరంగంలో ప్రవేశించింది. ‘సుదర్శన చక్ర’ అంటే ఏదో సాదాసీదా పరికరం కాదు..ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా పేరొందినది. సుదర్శన చక్ర అంటే ‘భారత గగనతల రక్షణ వ్యవస్థ’.   

సుదర్శన్ చక్ర పరిధి 400 కిలోమీటర్లు. అంతేకాదు దాదాపు 600 కి.మీ.ల దూరం నుంచే నిర్ధేశిత లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది. మాక్ 14 అంటే ధ్వని వేగానికి 14 రెట్ల స్పీడ్ తో లక్ష్యాలను ఛేదించగలదు. ఆకాశంలో ఏ వైపు నుంచి శత్రు దేశపు మిస్సైల్స్, డ్రోన్లు, విమానాలు వచ్చినా ఏక కాలంలో అన్నింటినీ కూల్చివేయగల శక్తి గలదే మన సుదర్శన చక్ర. అలాంటి అరవీర భయంకర ‘సుదర్శన చక్ర’ సంసిద్ధంగా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే..


సీన్ మారింది...

రాత్రి 11:43 PM: పాక్ వైపు నుంచి మొదటి డ్రోన్ లోపలికి ప్రవేశించింది.
11:45 PM : S-400
న్యూ ఢిల్లీలో గర్జించింది మొదటి రౌండ్ ప్రయోగం!
11:47 PM :
జైపూర్ వాయుసేన స్థావరాన్ని టార్గెట్ చేసిన మిస్సైల్ ను 30,000 అడుగుల ఎత్తులో S-400 అడ్డుకుంది.
అంతే కాదు, లాహోర్ సమీపంలో ఉన్న పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్‌ను భారత హార్పి (HARPY) డ్రోన్లు తుడిచిపెట్టేశాయి.

"సుదర్శన్ చక్ర" అంటే ‘తలుచుకున్న మిషన్ మీద మడతపెట్టే అస్త్రం!’గా పిలుస్తారు.

 

పాక్ వదిలినవాటికి భారత్ గర్జనతో సమాధానాన్ని ఇచ్చింది.

పాక్ దాడిని ప్రపంచం ఖండించకపోయినా,
భారత తక్షణ స్పందనకు అంతర్జాతీయ మీడియా మెచ్చుకుంది:

 

BBC Headline: “India’s S-400 Roars to Life – Pakistan’s Offensive Neutralized.”
Al Jazeera: “India Demonstrates Unmatched Defensive Capabilities.”

 

గుర్తుంచుకోండి మిత్రులారా...

‘సుదర్శన చక్ర’ అంటే..

"శత్రువు ఎక్కడినుంచి వచ్చినా సరే,

భరత భూమిలోని ధూళి కణాలను కూడా సురక్షితంగా ఉంచడానికి నిరంతర అప్రమత్తతతో పనిచేసే బలమైన రక్షణ వ్యవస్థ"

‘సుదర్శన చక్ర’ - ఆశ్చర్యపరిచే సంగతులు :

  • అమెరికా ఎంఐఎం - 104 పాట్రియాట్ (MIM-104 Patriot) : ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతున్న ఒక బలమైన వ్యవస్థ. ఇది విమానాలు, క్షిపణులు మరియు డ్రోన్‌లను ఎదుర్కోవడానికి రూపొందించబడింది. దీని కంటే ‘సుదర్శన చక్ర (S-400)’ పరిధి ఎక్కువ. అంతేకాదు ‘సుదర్శన చక్ర’ ఎక్కువ రకాల క్షిపణులతో  విధ దూరాలు, ఎత్తుల్లో ఉన్న లక్ష్యాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలదు.
  • అమెరికా ‘థాడ్’ (THAAD - Terminal High Altitude Area Defense) : భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న ఖండాంతర క్షిపణులను ‘థాడ్’ ఎత్తైన ప్రదేశాల్లోనే అడ్డుకోగలుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన సామర్థ్యం, కానీ ఇది ‘సుదర్శన చక్ర’ మాదిరిగా అనేక రకాల వైమానిక లక్ష్యాలను ఎదుర్కోలేదు. సుదర్శన చక్ర యొక్క పరిధి మరియు బహుళ-స్థాయి రక్షణ సామర్థ్యం THAAD కంటే ఉన్నతంగా ఉంటాయి.
  • చైనా హెచ్ క్యూ 9 (HQ-9) : 
  • ఎస్-300 వ్యవస్థపై ఆధారపడి చైనా హెచ్ క్యూ 9 అనే ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించుకున్నది. దీని రాడార్ సాంకేతికత, క్షిపణి పరిధి ‘సుదర్శన చక్ర’ కంటే తక్కువగానే ఉంది.
  • ఇజ్రాయెల్ David's Sling: ఇది మధ్య నుండి దీర్ఘ-శ్రేణి క్షిపణులను మరియు విమానాలను అడ్డుకోవడానికి రూపొందించబడింది. ఇది ‘సుదర్శన చక్ర’ వలె విస్తృతమైన పరిధిని కలిగి ఉండకపోవచ్చు, కానీ ఇది తనదైన ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉంది.
  • భారత్ బరాక్ 8 (Barak-8) : ఇదొక మధ్యశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ. దీనికి కేవలం విమానాలు, క్షిపణులను మాత్రమే ఎదుర్కోగల సామర్థ్యం గలదు. ఇజ్రాయెల్ మరియు భారత్ ఉమ్మడిగా తయారుచేశాయి.


సుదర్శన్ చక్ర (S-400) ఎందుకు ప్రత్యేకం :

  • ప్రపంచంలోనే అధునిక గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా ‘సుదర్శన చక్ర’ పేరొందింది.
  • అత్యధిక పరిధి: ఇది 400 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేధించగలదు, ఇది చాలా ఇతర వ్యవస్థల కంటే ఎక్కువ.
  • బహుళ-స్థాయి రక్షణ: ఇది వివిధ పరిధులు మరియు ఎత్తుల కోసం అనేక రకాల క్షిపణులను ఉపయోగిస్తుంది, తద్వారా ఒక సమగ్రమైన రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది.
  • గుర్తించే సామర్థ్యం: దీని శక్తివంతమైన రాడార్ 600 కిలోమీటర్ల దూరం వరకు అనేక లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు.
  • వేగం: ఇది చాలా వేగంగా కదిలే లక్ష్యాలను కూడా అడ్డుకోగలదు.
  • నిర్దిష్ట లక్ష్యం లేదు: ఇది కేవలం బాలిస్టిక్ క్షిపణులు లేదా విమానాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడలేదు; ఇది అనేక రకాల వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి సమర్థవంతమైనది.
  • మొబిలిటీ: ఇది మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లపై అమర్చబడి ఉండటం వలన త్వరగా మోహరించవచ్చు మరియు తరలించవచ్చు.
  • ‘సుదర్శన చక్ర’ పరిధి, బహుళ-స్థాయి రక్షణ సామర్థ్యం, గుర్తించే శక్తి, బహుళ ప్రయోజక స్వభావాలతో అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా చరిత్ర సృష్టిస్తున్నది. 


చివరగా :

ఈ రోజుల్లో యుద్ధాలు తుపాకులతో కాకుండా టెక్నాలజీతో జరుగుతున్నాయి.
అక్కడే భారత్ పోటీకి మించి ముందుంది.
నేటి ‘సాంకేతిక ధర్మ యుద్ధం’లో భారత ప్రధాన రక్షణ వ్యవస్థనే ‘సుదర్శన చక్ర (ఎస్-400)’

 "ధర్మం సంస్తాపనార్థాయ, సమావేశం సదాశయమ్।

శత్రు సంహారకాయ, సుదర్శనాయ నమః॥"


భారత సుదర్శన్

సామాజిక, రాజకీయ విశ్లేషకుడు


(ఈ వ్యాసాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి. దేశ రక్షణలోని నిజమైన శక్తిని ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి)

Tags : #S400India #OperationSindhoor #BharatDefends #PakVsIndia #SudarshanChakra #bharatha360 #BharathaSudharshan 

"© 2025 [Bharatha360/bharatha360.blogspot.com]. All rights reserved. Unauthorized copying is prohibited."


Comments

Popular posts from this blog

వెనుజులా సంక్షోభం : చమురు ఉన్నా చీకట్లోనేనా దేశ భవిష్యత్తు? i Venezuela Crisis: Despite Having Oil, Is the Country's Future Still in Darkness?

"జపాన్ బాబా వంగా" భవిష్యవాణి ప్రపంచాన్ని ఎందుకు కదిలించింది? I Why the “Japan’s Baba Vanga” Prediction Shook the World ? I Bharatha Sudarshan, Socio-Political Analyst

"ట్రంప్ 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'లో ఏముంది?" I What’s Inside Trump’s 'Big Beautiful Bill'?