భారత్ 'పాక్' ను పాలించాలి! : ప్రజల నిరసనలు, మారుతున్న చైతన్యం I "India Should Govern Pakistan! – Rising Voices, Fading Fears"
అవునూ..మీరు చదువుతున్నది నిజమే!. ఇదే ఏమాత్రం హాస్యాస్పదమైన అంశం కాదు. గుండెల్లో భయం, కడుపులో ఆకలి, చేతిలో నిదాన మరణం!. లూటీ పాలకులు ఏటా వేల కోట్లను దోచేస్తుంటే – ప్రజల జీవితాల్లో ఒక్క రూపాయి వెలుగు లేదు. "ఇది దేశం కాదు… దహనశాల! అంటూ లక్షాలాది పాకిస్తాన్ ప్రజలు రోజూ మౌనంగా రోదిస్తున్నారు, శవాల్లా బతికేస్తున్నారు. ఇటీవల లాహోర్, పేషావర్, సిన్నర్ వంటి నగరాల్లో జరిగిన, జరుగుతున్న నిరసనలు ఈసారి భిన్నంగా ఉన్నాయి. మన దేశాన్ని పాలించే వారికి మానవతా విలువలు లేవు. “ఇదెంతకాలం? అన్న పదాలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. అనివార్యంగా మారిన ఈ దుస్థితి నుండి పాక్ ప్రజలు తేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వారి నోటివెంట తమను 'భారతే పాలించాలి!' అనే నినాదాలు వినిపిస్తున్నాయి. గతంలోనూ, ఇప్పుడు యుద్ధ సమయంలోనూ పాక్ సామాన్య ప్రజలు అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాలను వెల్లడించడం మనకు తెలిసిందే. ఇదేదో సాహసోపేతమైన కల కాదు... ఇది పాకిస్తాన్ ప్రజల నేటి నిశ్వాసం. పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న దారుణ పాలన, అతలాకుతలమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలతో దేశం కుంగిపోతోంది. ఆ దుస్థితికి కేంద్ర బిందువుగా మారిన ప్రజల్లో ఇప్పుడు “ఇలాంటి ప్రభుత్వానికి కన్నా, భారత్ పాలన దొరికితేనే మనకు బ్రతుకు ఉంటది” అనే భావన బలపడుతోంది. ఒక దేశంలో జరిగిన, జరుగుతున్న అనైతిక పాలన, అసాంఘిక శక్తుల ఆధిపత్యాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారినప్పుడు ఆ దేశ పరిపాలనను మరొక దేశానికి అప్పగించడం పాక్ ప్రజలకే కాదు, ప్రపంచానికీ మేలు జరుగుతుందనే భావన ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నది. పహెల్గాం ఘటన తర్వాత జరిగిన ఇండో పాక్ యుద్ధం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ‘ఐక్యరాజ్య సమితి’ ఆధ్వర్యంలో పాకిస్థాన్ దేశ పరిపాలనను ‘భారత ప్రభుత్వం’ కనీసం రెండేళ్లపాటైనా నిర్వహించాలనే డిమాండ్ పాక్ నుండే కాదు ప్రపంచం కూడా కోరుకుంటున్నది. ఎందుకంటే..
‘పాక్’లో
విఫల పాలన..ఆర్థిక దివాళా!
‘మింగ మెతుకు లేకున్నా..మీసాలకు సంపెంగ నూనె కావాలి’’ అన్నట్టుగా పాక్ పాలకులు తయారయ్యారు. ప్రజల కనీస అవసరాలు
తీర్చే అతీగతీ లేకున్నా భారత్ తో సిగ్గులేకుండా యుద్ధానికి సిద్ధపడ్డారు. చివరకు
ఐఎంఎఫ్ ముందు చేతులు చాచి అడుక్కునే పరిస్థితికి చేరుకున్నారు. పాకిస్తాన్ రూపాయి
విలువ గత మూడేండ్లలో 30% కంటే ఎక్కువగా తగ్గింది. దాల్చిన చెక్కలకి కూడా సబ్సిడీలు
ఇవ్వలేని దుస్థితి నెలకొంది. విద్యుత్ కోతలు రోజువారీ సమస్యగా మారాయి.
ప్రజాస్వామ్యం పేరుతో ఆర్మీ నియంత్రణ, స్వేచ్ఛల మర్ధన, మీడియా పై ఆంక్షలు రోజురోజుకూ పెరిగిపోయింది.
పాకిస్థాన్ 2023-24 బడ్జెట్ ప్రకారం.. మొత్తం ఆదాయం (Gross Revenue) రూ. 12.378 లక్షల కోట్లు. ఇందులో రూ. 5.399 లక్షల కోట్లు ప్రావిన్సులకు బదిలీ చేయబడింది. నికర ఆదాయం (Net Federal Revenue):
రూ. 6.979 లక్షల కోట్లు. మొత్తం ఖర్చులు (Total Expenditure) రూ. 14.485 లక్షల కోట్లు. వీటిలో అప్పులపై వడ్డీలు (Interest Payments) రూ. 7.303 లక్షల కోట్లు. ఇది మొత్తం ఖర్చులలో సుమారు 50.4%. రక్షణ ఖర్చులు (Defence Expenditure) రూ. 1.804 లక్షల కోట్లు. మొత్తం బడ్జెట్లో సుమారు 12.47%. సబ్సిడీలు (Subsidies) రూ. 1.1 లక్షల కోట్లు. పింఛన్లు (Pensions) రూ. 801 బిలియన్లు. ఈ పింఛన్లు గత ఏడాదితో పోలిస్తే 31% పెరిగింది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మొత్తంగా
విశ్లేషిస్తే.. నికర ఆదాయం: రూ. 6.979 లక్షల కోట్లు అయితే మొత్తం ఖర్చులు రూ. 14.485 లక్షల కోట్లు. అంటే చివరికి రూ. 7.506 లక్షల కోట్ల లోటు (Fiscal Deficit) పాక్ ‘ఆర్థిక వ్యవస్థ ప్రాణం’ ఆరిపోయే దీపంలో మిణుకుమిణుకుమంటోంది. ఏ విధంగానైనా ఈ గణాంకాలు
చూస్తే, పాకిస్థాన్
ఆదాయం దాని ఖర్చులకు సరిపడటం లేదు. ముఖ్యంగా అప్పులపై వడ్డీలు, రక్షణ ఖర్చులు, సబ్సిడీలు, పింఛన్లు వంటి ఖర్చులు అధికంగా ఉండటం వల్ల, దేశం ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. ఇది పాక్‌ను
ఆర్థికంగా బానిస దేశంగా మారుస్తోంది.
‘భారత్’ యే
ఎందుకు పాలించాలి?
ఒక దేశం మరొక దేశాన్ని పాలించడం సామ్రాజ్యవాదం అవుతుందనే వాదన
కూడా చర్చలోకి వస్తుంది. కానీ అన్ని రకాలుగా దివాళా అంచున ఉన్న పాకిస్థాన్ దేశం
ప్రపంచ అశాంతికి కారణభూతమవుతున్నది. ఉగ్రవాదుల ప్రపంచ కేంద్రంగా మారుతున్నదనే
ఆందోళనల నేపథ్యంలో, భారత్, పాక్ లు అవిభాజ్య ప్రాంతాలు కాబట్టి మిగిలిన దేశాల కంటే భారత
ప్రభుత్వమైతేనే పాక్ ను అన్ని విధాలుగా సరిదిద్దగలదనే అభిప్రాయం సర్వత్రా
వ్యక్తమవుతున్నది. ఈ కోణంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పాక్ లో ‘భారత ప్రభుత్వం’ కనీసం రెండేండ్లు పరిపాలన చేపట్టాలని పాక్ సామాన్య ప్రజలు
సైతం కోరుకుంటుండటం విశేషం.
పాకిస్థాన్ దేశంలోని ప్రజలు దశాబ్దాలుగా పేదరికం, ఉగ్రవాదం, మతతత్వ పాలనలో తలమునకలై ఉన్నారు. ఈ పరిస్థితి మార్చాలంటే అభివృద్ధి
లక్ష్యంగా పనిచేసే శక్తి కావాలి – అది భారత్ దగ్గరే ఉంది. భారత ప్రజాస్వామ్య విధానం, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి మోడల్, శాంతియుత పాలన – ఇవన్నీ పాక్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచగలవు. పైగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ భారత్ మొత్తం దక్షిణాసియా
ప్రాంతంలో శాంతికి, స్థిరత్వానికి మార్గదర్శక దేశంగా నిలుపుతుంది.
‘భారత్ సుపరిపాలన’
పై పాక్ ప్రజల ఆశ!
భారత్ ఒక బహుళ సాంస్కృతిక, బహుళ మత దేశం. ఇక్కడున్న ముస్లింలు విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి అనేక రంగాల్లో బలంగా ఉన్నారు. ఉదాహరణకు హైదరాబాదులోని ముస్లిం
యువతీయువకులు పెద్దఎత్తున ఐటీ రంగంలో, స్టార్టప్ రంగాల్లో నిలదొక్కుకుంటున్నారు. ఇలాంటి అవకాశాలే
పాక్‌లో దొరకడం లేదు. అందుకే ప్రజలలో అసహనం... భారత అభివృద్ధి మోడల్ పట్ల ఆకర్షణ
పెరుగుతున్నది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న
చర్చలు మనకు తెలియజేస్తున్నాయి. “పాక్ పౌరులు వీసా రిక్వెస్ట్‌తో కాదు, ఓటింగ్ హక్కుతో భారత్‌లో జీవించాలి” అనే కామెంట్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇది పాక్ ప్రజల మౌలిక
హక్కులపై కొత్త దృక్పథానికి సంకేతం. వీటన్నిటికీ మూలం – భయంకర పాలనపై అసహనం, శాంతి
పట్ల ఆశ.
‘భవిష్యత్ దిశ –
బాధ్యత’ను
భారత్ చేపట్టాలా?
నేడు ప్రపంచ రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోంది. అనేక దేశాలు దేశ భద్రత కంటే, పాలన
సామర్థ్యాన్ని చూస్తున్నాయి.పాకిస్తాన్లో ప్రజల
సంక్షేమం కోసం, ఉగ్రవాద
నిర్మూలన కోసం – తాత్కాలికంగా
అయినా పాలనా బాధ్యతలను భారత్ చేతుల్లోకి అప్పగించాలన్న డిమాండ్ పాక్ లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ పెరుగుతున్నది. భారత్‌కు ఇది భూమి కాదు – బాధ్యత. ప్రజలకు ఇది ఆక్రమణ కాదు – రక్షణ.
పాక్‌ను భారత్ పాలించాలన్న మాట విన్నవెంటనే కొందరు ‘సార్వభౌమాధికారం’ అనే వాదనలతో ఎదురుపడవచ్చు. కానీ, ఇది ఏ దేశాన్ని కబళించాలన్న అహంకార ధోరణి కాదు. ఇది పూర్తిగా
ఒక దివాళా పాలిత దేశాన్ని శాంతి, అభివృద్ధి, మానవతా విలువలతో పునర్నిర్మించాలన్న బాధ్యతాయుతమైన ఆలోచన.
అంతర్జాతీయంగా ఇప్పటికే ఐక్యరాజ్య సమితి (UN) ఆధ్వర్యంలో అనేక దేశాల్లో ఈ తరహా పాలనా ప్రమాణాలు
అమలవుతున్నాయి. కాంగో, సౌతీ సూడాన్, రువాండా వంటి దేశాల్లో ఐరాస శాంతి పరిరక్షక దళాలు అల్లర్ల
ముసుగులో నలిగిన ప్రజల రక్షణకు పాలనలో భాగమవుతున్న ఉదాహరణలు ఉన్నాయి. దానిలో
సింహభాగం భారత్ శాంతి దళాలే ముఖ్య భూమిక పోషిస్తున్నవి. అదే విధంగా ఐక్యరాజ్య
సమితి నేతృత్వంలో, భారత ప్రభుత్వం — చట్టబద్ధమైన నిర్ణయంతో — పాక్‌లో కనీసం రెండేళ్లు పరిపాలన చేపట్టి, అక్కడి ప్రజలకు భద్రత, జీవనోపాధి, న్యాయం, విద్య, వృద్ధి వంటి మౌలిక అవసరాలు అందించే బాధ్యత తీసుకోవాలి. ఇది
పాక్‌ను ఆక్రమించడమేమీ కాదు — ఒక విఫల రాష్ట్రాన్ని నిలదొక్కుకునేలా చేయడమే. ఇది అంతర్జాతీయ
శాంతికే సేవ.
‘భారత పాలన’తో
ఉపయోగాలు ఎన్నెన్నో!...
భారత పాలన వల్ల పాక్ ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అనేక
దశాబ్ధాలుగా తీవ్రవాదం, నిరుద్యోగం, విద్యా లోపం, అసమానతలు, మహిళలపై హింస, విద్యుత్ కొరత వంటి మౌలిక సమస్యలు పాకిస్థాన్ ప్రజల జీవితాలను
నాశనం చేశాయి. ఇప్పుడు సరైన సమయంలో అక్కడ ‘భారత పాలన’ వస్తే పాక్ ప్రజలు స్థిరమైన పాలన, వ్యవస్థీకృత న్యాయవిధానం, వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఆర్థిక విధానాలు, స్వేచ్ఛా హక్కులతో కూడిన పౌర సమాజాన్ని పొందగలుగుతారు.
అవినీతి రహిత పరిపాలన, డిజిటల్ పౌర సేవలు, ఆరోగ్యరంగ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాల ద్వారా వారి జీవితాల్లో
స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ పరిణామాలు ఒక్క పాక్ ప్రజలకే కాదు — ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటుతాయి. ఉగ్రవాదం
తగ్గిపోతుంది. శరణార్థుల ప్రవాహం ఆగుతుంది. దక్షిణాసియా అంతటా వాణిజ్య, మానవ సంబంధాల్లో వృద్ధి సాధ్యమవుతుంది. 'వసుధైక కుటుంబం' అనే భారత సూత్రం ప్రపంచానికి బంగారు భవిష్యత్తును
చూపిస్తుంది. పాక్ ప్రజల ఆవేదనను శాంతియుత మార్గంలో పరిష్కరించాలంటే, పరోపకారంలో పరాకాష్ట అయిన భారత పాలనే సరైన దారి. భారత పాలన
అంటే కేవలం వ్యక్తుల పాలన అని అపోహపడొద్దు. భారత పాలన అంటే వసుధైక కుటుంబ పాలన అని
భావించాలి. పాక్ ప్రజలపై అధికారం కోసం చేసే పాలన ఎంతమాత్రమూ కాదు — ఇది బాధ్యతగా, పాక్ సామాన్య ప్రజలు మరియు ప్రపంచ శాంతి కోసం ఎత్తిన ఒక
సామాజిక, రాజకీయ, ఆర్థిక భారత ధర్మయుద్ధం.
సర్వే
భవంతు సుఖినః
సర్వే
సంతు నిరామయాః।
సర్వే
భద్రాణి పశ్యంతు
మా
కశ్చిద్ దుఃఖభాగ్భవేత్॥
-
భారత
సుదర్శన్
సామాజిక
రాజకీయ విశ్లేషకులు | Bharatha360.com
Disclaimer: “The views expressed in this article are solely
those of the author. The content is meant purely for healthy public discourse,
critical analysis, and academic discussion.”
#PakistanCrisis #IndiaPakistanRelations
#OperationSindhoor #Geopolitics #BharathaSudarshan #Bharatha360 #UNIntervention
#FailedState #SouthAsiaPeace #IndiaAsPeacekeeper
© 2025 Bharatha Sudarshan | Bharatha360.com
All rights reserved. No part of this article may
be reproduced, distributed, or transmitted in any form or by any means,
including photocopying, recording, or other electronic or mechanical methods,
without the prior written permission of the author, except in the case of brief
quotations embodied in critical reviews and certain other non-commercial uses
permitted by copyright law.

wonderful analysis..
ReplyDelete