"ట్రంప్ 'బిగ్ బ్యూటిఫుల్ బిల్'లో ఏముంది?" I What’s Inside Trump’s 'Big Beautiful Bill'?
"మాట నిలబడితేనే మానవుడికి మన్నింపు
ఉంటుంది" అనే నానుడి సత్యమైదని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లుగా ప్రజలకి ఆశ చూపిన "బిగ్
బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful
Bill)" ఇప్పుడు నిజంగానే యూఎస్ కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016 నుంచే ఈ మాట వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఇది ఒక 900-పేజీల భారీ చట్టబిల్లుగా అమెరికా సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్ నుంచి
దూసుకెళ్లింది. జులై 4, 2025న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
అధ్యక్షుడు ట్రంప్ దీనిపై సంతకం చేశారు.
‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ అంటే..
ట్రంప్ చెప్పిన "Big Beautiful Bill".. ప్రచారంగా మొదలై నిజం అయ్యింది. ఇది ఒక పాపులిజం నుంచి పద్ధతిగా మారిన రాజకీయ ప్రయోగం. "బిగ్ బ్యూటిఫుల్ బిల్" (Big Beautiful Bill) అనే
పదజాలం ఇటీవల అమెరికా రాజకీయ చర్చల్లో వినిపించిన ఒక ఆసక్తికరమైన టర్మ్. ఇది ఒక
అధికారిక బిల్లు (సంస్కరణా చట్టం లేదా విధాన ప్రతిపాదన) గురించి కాకపోయినా, దాని
వెనుక ఉన్న ఆలోచన, దాన్ని చెప్పిన వ్యక్తి, దానికి
ఎదురుగా వచ్చిన స్పందనలు అన్నీ కలిసే ఈ పదాన్ని రాజకీయ సంస్కృతిలో చొప్పించాయి. ఈ
పదాన్ని మొట్టమొదటగా వినిపించినది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పాలనలో, ముఖ్యంగా మైగ్రేషన్, ఇమిగ్రేషన్, వాల్బిల్డింగ్
వంటి అంశాలపై ఆయన మాట్లాడుతూ, "We’re working on a Big, Beautiful Bill..." అని పదే పదే పేర్కొనేవారు. ఇదే వాక్యం, ట్రంప్
మాదిరిగా మాట్లాడుతూ కొంత మంది అనుకూలులు, మరికొంత మంది వ్యంగ్యంగా వాడటం
మొదలైంది. "Big Beautiful Bill" అన్న మాటను ట్రంప్ వాడిన సందర్భాల్లో
ముఖ్యంగా.. ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ పై జోక్యం, బార్డర్ వాల్ బడ్జెట్ కోసం డిమాండ్, హెల్త్‌కేర్ రీఫార్మ్ బిల్లులపై సూచనలు, టాక్స్ కోడ్ మార్పులపై ప్రతిపాదనలు
లాంటి ప్రాముఖ్యంగా
కనిపించే విషయాలు ఉన్నాయి. అయితే, “Big
Beautiful Bill” అనే మాట
వాస్తవానికి ఏదైనా బిల్లు పేరు కాదు. ఇది
ఒక రెహెటారికల్ ఫ్రేమ్ – అంటే
ప్రజలను ఆకర్షించేలా, శ్రద్ధ పొందించేలా వేసే పదజాలం. దీన్ని
వాడుతూ ట్రంప్ ప్రజలకు ఓ ఆశ చూపించే ప్రయత్నం చేశారని, దీనికి వాస్తవికత లేదంటూ విపక్షాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తీవ్రంగా విమర్శించాయి.
ఈ బిల్లులో ఏముందంటే..
ఈ బిల్లులో
అమెరికా దేశపు ఆర్థిక, ఆరోగ్య, భద్రత తదితర అనేక వ్యవస్థలపై ముఖ్యమైన అంశాలు
పొందుపరిచారు. వాటిలో $4.5 ట్రిలియన్ వరకు టాక్స్ రాయితీలు ఉన్నాయి.
$2,000 చైల్డ్ టాక్స్ క్రెడిట్‌ను $2,200కి పెంచారు. టిప్పులు, ఓవర్‌టైం, ఆటో లోన్స్ పై ప్రత్యేక డిడక్షన్లు ఉన్నాయి. 60 ఏళ్లు పైబడినవారికి $6,000 ప్రత్యేక డిడక్షన్ (ఆదాయం $75,000 లోపు ఉంటే), సామాజిక భద్రత పై పన్నులు రద్దు చేయాలన్న
వాగ్దానాలకి అంకితమయ్యేలా అనేక అంశాలున్నాయి. క్లీన్ ఎనర్జీపై వేట కొనసాగేలా ఉంది.
2022లో వచ్చిన ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ (Inflation Reduction Act) లోని ఈవీ (EV) కొనుగోలు పై ప్రోత్సాహకాలు, హోం
చార్జింగ్ స్టేషన్లు, ఇన్సులేషన్, గృహ ఎనర్జీ
ఎఫిషియెన్సీ అప్‌గ్రేడ్లకు ఇచ్చే రాయితీలు తగ్గించబడ్డాయి. గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్ ఫండ్ (Greenhouse Gas Reduction Fund) మూసివేత, సరిహద్దుల భద్రత – భారీ బడ్జెట్, $350 బిలియన్ వినియోగం, 100,000 డిటెన్షన్ బెడ్స్, 10,000 కొత్త ICE ఆఫీసర్ల నియామకం, $10,000 సైన్-అప్ బోనస్, బార్డర్ పట్రోల్ ఉద్యోగుల్లో విస్తరణ, మిలటరీకి ప్రత్యేక బడ్జెట్, “Golden Dome” మిస్సైల్ డిఫెన్స్‌కి $25 బిలియన్, మెడికెయిడ్ పై కత్తి, ప్లాన్డ్
పేరెంట్‌హుడ్ వంటి అబార్షన్ సేవలిచ్చే సంస్థలపై ఏడాది
నిషేధం, కొన్ని వర్గాల వారికి వర్క్ రిక్వైర్మెంట్, 11.8 మిలియన్ల మంది మెడికెయిడ్ నుంచి తొలగించే
అవకాశమని CBO అంచనా, గ్రామీణ హాస్పిటల్స్‌కి $10 బిలియన్ వార్షిక నిధులు వంటి అనేక కీలక
అంశాలు ఈ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’లో పొందుపరచబడ్డాయి.
‘ట్రంప్’ సందేశం ఏంటంటే..
ఈ బిల్లుతో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు టాక్స్ తగ్గింపు, వలసదారులపై
కఠిన చర్యలు, మిలిటరీకి బలపర్చే బడ్జెట్ లాంటివన్నీ అందించగలిగారు. కానీ…పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సేవలపై తీవ్రమైన
ప్రభావం, వాతావరణ పరిరక్షణకు ప్రమాదం, సోషియల్ స్కీముల మీద తీవ్ర దెబ్బ తదితర అంశాల్లో
సంతృప్తి పరచలేకపోయారు. ఈ బిల్లుకు రిపబ్లికన్లు అత్యధికంగా మద్దతు ఇచ్చారు. అయితే సెనెట్‌లో టైబ్రేకింగ్ ఓటును వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్ వేశారు. ఇది ఈ చట్టం వెనుకున్న రాజకీయ విభజనను చూపిస్తుంది.
వాగ్దానం ఒకటి… అది అమలవుతుందో లేదో అనేది మరో విషయం. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు మాట నిలబెట్టుకుంటేనే
ప్రజలకు గౌరవం లభిస్తుందనే విషయాన్ని రూఢీ చేసేలా ఈ బిల్లుతో ట్రంప్ ఒక పెద్ద
చర్చను తెరపైకి తెచ్చారు.
“Words are
free. It’s how you use them that may cost you.”
- (KushandWizdom)
భారత సుదర్శన్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
#BigBeautifulBill
#TrumpTaxCuts #USImmigrationPolicy #TrumpHealthcareBill #USPolitics2025
#BharathaSudarshan #Bharatha360 #RepublicanPriorities #CongressBill2025
#AmericanLegislation
Disclaimer:
The views
expressed in this article are solely those of the author. The content is meant
purely for healthy public discourse, critical analysis, and academic
discussion.
© 2025 Bharatha Sudarshan | Bharatha360.com
All rights reserved. No part of this article may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the author, except in the case of brief quotations embodied in critical reviews and certain other non-commercial uses permitted by copyright law.

Comments
Post a Comment